ఆర్‌ఆర్‌ఆర్‌: రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌

22 Oct, 2020 11:55 IST|Sakshi

జూనియర్‌  ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  భారీ బడ్జెట్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటన్నింటికి ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో పోస్టర్‌.. దేశభక్తి మూవీ కాదు

ఈ క్రమంలో తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి సంబంధించి రామ్‌చరణ్‌ ఎన్టీఆర్‌కు రిటర్న్‌ గిప్ట్‌ ఇచ్చారు. నేడు కొమురం భీం జయంతి సందర్భంగా రామరాజు వాయిస్‌కు సంబంధించిన ఎన్టీఆర్ టీజర్‌ని చరణ్‌ విడుదల చేశారు. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ యాక్షన్స్‌కి రామ్ చరణ్ వాయిస్ ఇచ్చారు. రామ్ చరణ్ వాయిస్‌తో ప్రారంభమైన వీడియోలో.. వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి, నిలబడితే సామ్రాజ్యలు సాగిలపడతాయి, వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ, వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్నెం ముద్దు బిడ్డ, నా తమ్ముడు గోండ్రు బెబ్బులి కొమురం భీం అంటూ ఎన్టీఆర్ పాత్రల తీరుతెన్నులని పరిచయం చేశారు. చదవండి: ‘ఒక్క ఫోటో.. నీ కష్టం ఏంటో తెలుపుతోంది’

ఈ వీడియోలో ఎన్టీఆర్  తన అభిమానుల అంచనాలకు తగ్గకుండా అంతే రీతిలో భీమ్‌గా అదరగొట్టాడు. ఇక రామరాజుకు రామ్ చరణ్ ఇచ్చిన మెగా పవర్‌ఫుల్ వాయిస్ గంభీరంగా, అద్భుతంగా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భీమ్‌ టీజర్‌ లాగే ఈ టీజర్‌ కూడా సంచలనం సృష్టిస్తుందని సంబరపడిపోతున్నారు. కాగా ఈ చిత్రంలో అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్న రామ్‌ చరణ్‌కు చెందిన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ టీజర్‌ను ఆయన బర్త్‌డే రోజున విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో చరణ్‌కు ఎన్టీఆర్‌ వాయిస్‌ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్‌ పుట్టినరోజుకు మాత్రం ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో ఎన్టీఆర్‌ పాత్ర కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. ప్రస్తుతం రామరాజు ఫార్‌ భీమ్‌ పేరుతో రామరాజు టీజర్‌ విడుదల అవ్వడంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగి తేలుతున్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు