Rrr movie: ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్‌..పాల్గొన్న ఒలీవియా

8 Aug, 2021 12:17 IST|Sakshi

ఇలా ఫొటోలో వెనక్కి తిరుగుతున్నట్లు కనబడుతున్న ఒలీవియా మోరిస్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. స్వాతంత్య్రం కోసం ధైర్యసాహసాలతో పోరాడే కొమురం భీమ్‌తో ప్రేమలో పడే బ్రిటిష్‌ వనిత పాత్రను ఒలీవియా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. ఈ పాట షూట్‌ గ్యాప్‌లో ఇలా వెనక్కి తిరుగుతున్నట్లు ఉన్న ఫొటోను షేర్‌ చేసి, ‘ఇట్స్‌ గుడ్‌ టు బి బ్యాక్‌’ అంటూ.. మళ్లీ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆనందాన్ని వ్యక్తం చేశారు ఒలీవియా. 

A post shared by Olivia (@oliviakmorris)

మరిన్ని వార్తలు