RRR OTT Release: అప్పుడే ఓటీటీకి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

26 Mar, 2022 09:00 IST|Sakshi

RRR Movie OTT Streaming Details Inside: దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ శుక్రవారం(మార్చి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో జక్కన ఈ మూవీని రూపొందించాడు. భారీ మల్టీస్టారర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ కోమురం భీంగా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామారాజుగా నటించిన ఈ సినిమా హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంరతం నిన్న రిలీజ్‌ కావడంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల థియేటర్ల వద్ద సందడి వాతావరం నెలకొంది.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రివ్యూ

ఏ థియేటర్‌ ముందు చూసిన అభిమానుల హంగామా చూస్తుంటే పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇక ఇందులో తారక్‌, ఎన్టీఆర్‌ల పాత్రలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కాయమంటూ ఫ్యాన్స్‌ అంతా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కరోనా కాలం నుంచి ఓటీటీలు బిగ్‌స్క్రీన్‌కు పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌లో పూర్తిగా ఓటీటీ హవా కొనసాగడంతో ఇప్పటికీ సైతం ఎక్కడ తగ్గేదే లా అంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి కొత్త సినిమా సిల్వర్‌ స్రీన్‌పై సందడి చేసిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

చదవండి: RRR Movie: కర్ణాటక టికెట్‌ రేట్స్‌పై ట్రోలింగ్‌

ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా ఒక్క నెల రోజుల్లోనే వస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులను ఈ తాజా బజ్‌ షాకిస్తుంది. దీని ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ మూడు నెలల వరకు ఓటీటీకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. గతంలో మేకర్స్‌ కూడా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ థియేటర్లో విడుదలైన మూడు నెలల వరకు ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే ఈ మూవీ జూన్‌ తర్వాతే ఓటీటీలోకి వచ్చేటట్టు కనిపిస్తోంది. కాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకోగా.. హిందీ వెర్షన్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ కొనుగొలు చేసినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు