ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టర్‌పై ‘డాక్టర్‌ బాబు’.. ఇదేం వాడకం బాబోయ్

30 Jun, 2021 15:34 IST|Sakshi

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌధ్రం రణం రుధిరం) చిత్రం నుంచి మంగళవారం ఓ కొత్త పోస్టర్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ బండి నడుపుతుంటే.. రామ్‌ చరణ్‌ వెనకాల కూర్చొని చిరనవ్వులు చిందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అవుతోంది. అంతేకాదు ఈ పోస్టర్‌పై ఇప్పటికే రకరకాల మీమ్స్ వస్తున్నాయి. సైబరాబాద్‌  ట్రాఫిక్ పోలీసులు అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు హెల్మెట్ పెట్టి.. ఈ పోస్టర్‌ని ప్రమోషన్ కోసం వాడేశాడు. దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్పందించింది. మీరు పెట్టిన కాప్షన్ పర్ఫెక్ట్‌గా లేదు. బండికి నంబర్ ప్లేట్ మిస్సయింది అంటూ ట్రాఫిక్‌ పోలీసులు ట్విట్‌కి రిప్లై ఇచ్చింది. 

ఇక నెట్టింట ఏది వైరల్‌ అయినా.. కార్తీకదీపం సీరియల్‌తో ముడిపెట్టే నెటిజన్స్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ కొత్త పోస్టర్‌ని‘డాక్టర్‌ బాబు’కోసం వాడేశారు. డాక్టర్ బాబు బుల్లెట్ తోలుతుంటే.. వెనుక దీపతోపాటు మోనిత కూడా కూర్చుని ఉన్నట్టుగా మీమ్ క్రియేట్ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ మీమ్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇక దీనిపై డాక్టర్‌ బాబు అలియాస్‌ నిరూపమ్‌ పరిటాల కూడా స్పందించాడు. ఈ మీమ్‌ని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. ‘ఇలాంటి పోస్టర్‌ని ఎలా చేసార్రా బాబూ.. నాకు ఈ ఘోరానికి ఎలాంటి సంబంధం లేదు’ అని కామెంట్ పెట్టాడు. 

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విషయానికొస్తే.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ చిత్రమిది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్‌ అంతా పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల మందుకు రానుంది. 
చదవండి:
'ఆర్ఆర్ఆర్' పోస్టర్‌ను మార్ఫింగ్‌ చేసిన డేవిడ్‌ భాయ్‌.. తారక్‌గా కేన్‌ మామ

ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టర్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్.. టీమ్‌ ఫన్నీ రిప్లై

మరిన్ని వార్తలు