ఆర్‌ఆర్‌ఆర్‌: షాట్‌ గ్యాప్‌లో కెమెరామ్యాన్‌గా మారిన జక్కన్న..

7 Aug, 2021 19:20 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఆగస్టు చివరి కల్లా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కానున్నట్లు సమాచారం. ఫైనల్‌ షెడ్యూల్‌ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఉక్రెయిన్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్‌ గ్యాప్‌లో జక్కన తన హీరోలతో కాస్త సరదా సమయం గడిపారు.

రామ్‌చరణ్‌, తారక్‌లు పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, ఆ దృశ్యాలను రాజమౌళి ఓ డమ్మీ కెమెరాతో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. కాగా ఈ వీడియో ఎన్టీఆర్‌ కనుబొమ్మపై గాయం అయినట్లు కనిపిస్తుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు.

ఆలియా భట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మేకింగ్‌ వీడియాతో పాటు ఇటీవలె దోస్తీ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు