RRR Movie: ఊహించిందే జరిగింది.. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా

1 Jan, 2022 12:22 IST|Sakshi

RRR Movie Postponed: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని పోస్టర్లు, గ్లింప్స్‌, సాంగ్స్‌ అంటూ సినీ ప్రియులను అలరిస్తారనుకుంటే పెద్ద షాకే ఇచ్చారు ఆర్‌ఆర్‌ఆర్‌ రౌధ్రం..రణం..రుధరిం(ఆర్‌ఆర్‌ఆర్‌) టీమ్‌. ఇప్పటికే అనేకసార్లు వాయిదాపడ్డ ఆర్‌ఆర్‌ఆర్‌ మరోసారి వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం, థియేటర్‌ ఆక్యుపెన్సీలో ఆంక్షలతో సినిమా వాయిదా వేసేందుకే చిత్ర యూనిట్‌ నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోషన్లు చేసిన చిత్రయూనిట్‌ ఒమిక్రాన్‌ ఉధృతి వల్ల ఈ నెల 7న ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలను నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. సినిమా బడ్జెట్‌ దాదాపు రూ. 400 కోట్లుగా ఉంటే ఒక్కరోజు షూటింగ్‌కే రూ.75 లక్షలు ఖర్చయ్యేదట.

మరిన్ని వార్తలు