మళ్లీ వాయిదా పడిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ!

20 Aug, 2021 08:14 IST|Sakshi

జూనియర్‌  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(రౌద్రం,రణం, రుధిరం). ఉక్రెయిన్‌ చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవల ఈ మూవీ టీం హైదరాబాద్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడిందనే వార్త ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రెండుసార్లు (2020 జూలై 30, 2021 జనవరి 08) విడుదల వాయిదా పడిన ఈ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరు 13న విడుదల చేయాలనుకున్నారు.

చదవండి: RRR Movie: హైదరాబాద్‌ చేరుకున్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌

కానీ ఇప్పుడు అక్టోబరు 13న కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ కాదనే టాక్‌ వినిపిస్తోంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో థియేటర్స్‌ రీ ఓపెన్‌ కాకపోవడం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ విడుదలకు ప్రధాన ఆటంకంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది(2022) వేసవిలో విడుదల కానుందని భోగట్టా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తాజా షూటింగ్‌ షెడ్యూల్‌ ఉక్రెయిన్‌లో పూర్తయింది. ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా దాదాపు పధ్నాలుగు భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

చదవండి: బిగ్‌బాస్‌ 5: కంటెస్టెంట్స్‌ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు