ఆర్ఆర్ఆర్‌ టీజ‌ర్‌: ఇవ‌న్నీ ఇప్ప‌టికే చూసేశాం

22 Oct, 2020 16:38 IST|Sakshi

రాజ‌మౌళి నుంచి సినిమా వ‌స్తుందంటే దేశం అంతా ఎదురు చూస్తుంది. అలాంటిది ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో తీస్తున్న ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) నుంచి అప్‌డేట్ కోసం సినీ ప్రేక్ష‌కులు కొన్ని నెల‌లుగా ఎదురు చూస్తున్నారు. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసిన చిత్ర‌యూనిట్ కొమ‌రం భీమ్ పాత్ర‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ లుక్‌ను లేట్‌గా విడుద‌ల చేసినా లేటెస్ట్‌గా ఉంద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా కొమ‌రం భీమ్ సంద‌డే క‌నిపిస్తోంది. ఈ హ‌డావుడి చూస్తుంటే సినీ అభిమానుల‌‌కు ద‌స‌రా పండ‌గ మూడు రోజుల ముందే వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇక చెర్రీ టీజ‌ర్‌లో జ‌క్క‌న్న నిప్పును ఎక్కువ ఫోక‌స్ చేయ‌గా ఎన్టీఆర్ పాత్ర‌లో నీరును ఎక్కువ ఫోక‌స్ చేశారు. (చ‌ద‌వండి: ఆర్‌ఆర్‌ఆర్‌: రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌)

అయితే ఈ టీజ‌ర్‌లో ఓ విష‌యం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. 'వాడి పొగ‌రు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీక‌ట్ల‌ను చీల్చే మండుటెండ..' అని రామ్ చ‌ర‌ణ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపిస్తున్న స‌మ‌యంలో ఓ అగ్ని ప‌ర్వ‌తం బ‌ద్ధ‌లైన‌ట్లు చూపిస్తారు. చాలామంది అది ఎక్క‌డిదా అని తెగ వేయ‌గా నేష‌నల్ జియోగ్రాఫిక్ ఛాన‌ల్ లోనిది అని తేలింది. ఆ ఛాన‌ల్ వారు తొమ్మిది నెల‌ల క్రితం అగ్నిప‌ర్వ‌తాల విస్ఫోట‌నం గురించి యూట్యూబ్‌లో వీడియో పెట్ట‌గా అది ఇప్పుడు సినిమాకు ఉప‌యోగ‌ప‌డింద‌న్న‌మాట‌. దీనిపై కొంద‌రు సెటైర్లు వేస్తుండ‌గా, ఏదేమైనా అగ్ని ప‌ర్వ‌తాన్ని సృష్టించి బ‌ద్ధ‌లు చేయ‌లేం కదా అని జ‌క్క‌న్న అభిమానులు అంటున్నారు. ఇలాంటి క్లిప్పింగుల‌ను సేక‌రించ‌డం కూడా క‌ష్ట‌మైన ప‌నే అని చెప్పుకొస్తున్నారు. ఇంకా ప్రకృ ఫొటోలు కూడా వేర్వేరు వీడియోల నుంచి సేక‌రించారని అంటున్నారు (చ‌ద‌వండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో పోస్టర్‌.. దేశభక్తి మూవీ కాదు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు