RRR Movie In OTT: అప్పుడే ఓటీటీకీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్‌ డీల్‌!

12 Dec, 2021 17:20 IST|Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి, జూ. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. పిరియాడికల్‌ డ్రామా రూపొందించిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కాబోతోంది.  ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో గురువారం విడుదల చేసిన ట్రైలర్‌ కేక పెట్టిస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్‌ ఆద్యంతం అదరహో అనేలా సాగింది.

చదవండి: రజనీకాంత్‌ ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ ట్రైలర్‌ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. అన్ని భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై అధికారిక ప్రకటన సమాచారం రావాల్సి ఉంది.

చదవండి: విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీకి గుడ్‌బై చెప్పిన పూజా హెగ్డే

అంతేగాక ఈ సినిమా టోటల్ రన్ టైమ్‌ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్‌ భామ అలియా భట్‌, ఇంగ్లీష్‌ బ్యూటీ ఒలివియా కథానాయికలు కాగా.. బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ అజయ్‌ దేవగన్‌, శ్రియా సరన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా హిందీలో ఆర్‌ఆర్‌ఆర్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఈ సినిమా థియేటర్లో విడుదలైన 90 రోజుల తర్వాత జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో హందీ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ అవుతుందని ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహకులు, ప్రముఖ నిర్మాత జయంతిలాల్ గడా స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు