ఎన్టీఆర్‌, చరణ్‌ అభిమానులకు నిరాశే, ఇప్పట్లో కుదరదట!

10 May, 2021 21:36 IST|Sakshi

జూ. ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ల మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌధ్రం రణం రుధిరం). దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీపై ప్రేక్షకుల అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్ర .. చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రలు రెండు విభిన్నమైనవే. ఆశయం ఒకటే అయినా వాళ్లు ఎంచుకున్న పోరుబాట వేరు.

అలాంటి రెండు పాత్రలను ఒక చోటుకి చేరుస్తూ ఒకేసారి తెరపై చూపించడమంటే సాధారణ విషయం కాదు. 100 కోట్లకు పైగా బడ్జేట్‌తో రూపొందుతున్న ఈ మూవీని ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పోరాట సన్నివేశాల కోసం హాలీవుడ్‌ నుంచి స్టంట్‌ మాస్టర్‌ కూడా తీసుకువచ్చారు. దాదాపు ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నప్పటికి ఇంకా పలు కీలకమైన యాక్షన్‌  సన్నివేశాలు మిగిలే ఉన్నాయట.

ప్రస్తుత కరోనా కారణంగా షూటింగ్‌ వాయిద పడటంతో ఆ సన్నివేశాలను పూర్తి చేసే పరిస్థితులు లేకుండా పోయాయి. ముందుగా అనుకున్న తేదీకి ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల చేయడం కుదరని పని. దీంతో మూవీ విడుదల తేదీని వాయిదా వేయాలని దర్శక-నిర్మాతలు అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దసరాకి కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు దర్శక-నిర్మాతలు స్పందించలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఆర్‌ఆర్‌ సంక్రాంతికే రానుందని ప్రేక్షకులంతా భావిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు