RRR Movie Tickets Blocked: ఆన్‌లైన్‌లో కనిపించని 'ఆర్‌ఆర్‌ఆర్‌' టికెట్స్‌!

24 Mar, 2022 14:37 IST|Sakshi

'రౌద్రం రణం రుధిరం'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా కనిపిస్తుంది. సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎట్టకేలకు మార్చి25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్‌ కావడం, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి స్టార్‌ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

2018 నవంబర్ 11న ప్రారంభమైన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగేళ్ల కష్టం అనంతరం ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా గురించే కాకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్‌ రేటు కూడా మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో సుమారు అన్ని థియేటర్లలో టికెట్లను డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్‌ చేశారని సినీ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

మల్టీఫ్లెక్సుల్లోనూ టికెట్స్‌ బ్లాక్‌ చేయడంతో కొనుగోలు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. గత వారం రోజులుగా ట్రై చేస్తున్నా టికెట్స్‌ అందుబాటులో లేవని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ ఎఫెక్ట్‌ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్‌లో ఒక్కో టికెట్‌ను రూ. 3వేలకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు