అనుకోకుండా అలా కుదిరింది!

27 Aug, 2021 04:58 IST|Sakshi
రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ 

కొన్ని కొన్ని అనుకోకుండా కుదిరిపోతాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా అందుకు తాజా ఉదాహరణ. ఈ సినిమా షూటింగ్‌ని 2018 నవంబర్‌ 19న బైక్‌ సీన్‌ షూట్‌తో ఆరంభించారు. సినిమా షూటింగ్‌ చివరి రోజు బైక్‌ సీన్‌తోనే గుమ్మడికాయ కొట్టారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ పూర్తయింది. ‘‘చిన్న ప్యాచ్‌వర్క్‌ మినహా సినిమా మొత్తం పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. బైక్‌ సీన్‌తో సినిమా షూటింగ్‌ మొదలుపెట్టి, అదే సీన్‌తో ముగించడం అనుకోకుండా జరిగింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. 

మరిన్ని వార్తలు