RRR Movie:‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఖాతాలో మరో అరుదైన అవార్డు

26 Oct, 2022 15:17 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్‌గా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియ చిత్రం ‘ఆర్‌ఆ‍ర్‌ఆర్‌’. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం.. భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ వద్ద రికార్డు సృష్టించింది. ఎన్నో అరుదైన రికార్డులను సాధించిన ఈ చిత్రానికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది.

అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలకు ఇచ్చే శాటర్న్‌ అవార్డు ఈ ఏడాది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి లభించింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు దక్కించుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ను విజేతగా ఎంపిక చేసినందుకు జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపాడు దర్శకుడు రాజమౌళి. ఈ అవార్డును గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇది తనకు రెండో శాటర్న్ అవార్డు అని పేర్కొన్నాడు. కాగా, బాహుబలి: ది కన్‌క్లూజన్ చిత్రానికి కూడా శాటర్న్‌ అవార్డు లభించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు