RRR Movie: అవతార్‌ 2ను వెనక్కిన నెట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌, మరో అంతర్జాతీయ అవార్డుకు ఎన్నిక

31 Jan, 2023 13:07 IST|Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా ఆస్కార్‌కు చేరువలో ఉంది. ఇందులోని నాటు నాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌గా సాంగ్‌గా ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు మోత మోగిస్తున్న ఈ మూవీ తాజాగా మరో అంతర్జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకుంది. రోటెన్ టొమాటోస్ వారి గోల్డెన్‌ టమోటో అవార్డును ఆర్ఆర్ఆర్ గెలుచుకుంది.

చదవండి: తొలిసారిగా కూతురి ఫోటోలు రివీల్‌ చేసిన ప్రియాంక చోప్రా

రోటెన్ టొమాటోస్ సంస్థ ఈ ఏడాది నిర్వహించిన ఫ్యాన్స్‌ ఫేవరేట్‌ 2022 చిత్రాల జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గాను గోల్డెన్‌ టమోటో అవార్డుకు ‘అవతార్‌ 2: ది వే ఆఫ్‌ వాటర్‌, టాప్‌ గన్‌, బ్యాట్‌మెన్‌’ వంటి పలు హాలీవుడ్‌ చిత్రాలతో పోటీ పడిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ వాటిన్నింటిని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుని ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఫ్యాన్స్‌ ఫేవరేట్‌ మూవీ 2022గా నిలిచినట్లు తాజాగా రోటెన్ టొమాటోస్ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో 2022 ఫ్యాన్స్‌ ఫేవరేట్‌ మూవీ గోల్డెన్‌ టమోటో అవార్డుకు ఆర్‌ఆర్‌ఆర్‌ ఎన్నికైనట్లు ఈ సందర్భంగా సదరు సంస్థ వెల్లడిచింది. 

కాగా హాలీవుడ్‌కు చెందిన ఈ రోటెన్ టొమాటోస్ వెబ్ సైట్ ప్రతి సినిమాకు ప్రేక్షకుల రేటింగ్ ఇస్తుంటుంది. అలాగే ప్రతి ఏటా మంచి సినిమాలకు గోల్డెన్ టొమాటో అవార్డులను ప్రకటిస్తుంది. అలాగే ఈ ఏడాది ఎంతో ఆదరణ పొందిన అవతార్‌: ద వే ఆఫ్‌ వాటర్‌, ది బ్యాట్‌మెన్‌, టాప్‌ గన్‌, ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ వంటి చిత్రాలతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి జనవరి 12న ఓటింగ్‌ నిర్వహించింది. మొదటి వారం కాస్తా తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ రెండో వారానికి అత్యధిక ఓట్లు అందుకుని అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత స్థానాల్లో టాప్‌ గన్‌: మావేరిక్‌, ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆన్‌ ఎట్‌ వన్స్‌, ది బ్యాట్‌మెన్‌, అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ చిత్రాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 

చదవండి: అప్పుడే ఓటీటీలోకి ‘హంట్‌’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

మరిన్ని వార్తలు