ఆర్ఆర్ఆర్ అప్‌డేట్ వచ్చేసింది

6 Oct, 2020 12:12 IST|Sakshi

అక్టోబరు  22న "రామరాజు ఫర్ భీమ్''

రామ్ చరణ్ వాయిస్‌తో  రిలీజ్ కానున్న ఎన్టీఆర్  టీజర్

సాక్షి, హైదరాబాద్ : మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అప్‌డేట్ సమయం వచ్చింది అంటూ ఊరించిన యూనిట్ చివరకు మేకింగ్ వీడియోను తీసుకొచ్చింది. అంతేకాదు అక్టోబరు  22న "రామరాజు ఫర్ భీమ్'' కోసం ఎదురుచూడమని చిత్ర బృందం వెల్లడించింది. తద్వారా అభిమానుల ఎదురు చూపులకు తెరదించినా మరో ఉత్కంఠకు తెరతీసింది. అక్టోబరు 22 రామ్ చరణ్ వాయిస్ తో ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ కానుంది. 

తెలుగు సహా అన్ని బాషల అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం). బాహుబలి తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం పీరియాడిక్‌ యాక్షన్ డ్రామాగా  తెరకెక్కుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ఏడు నెలల విరామం తరువాత  హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ మళ్లీ ప్రారంభించింది. ఈ సందర్బంగా యూనిట్ బృందాన్ని మాదాపూర్‌లోని రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయకు చెందిన హోటల్‌లో ఉంచినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయ్యే వరకు బయటి వ్యక్తులను కలిసేందుకు అనుమతి లేకుండా పకడ్బందీ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ సెట్లో ఒక వైద్య బృందం అంబులెన్స్  కూడా సిద్ధంగా ఉన్నాయిట.

రామ్‌చరణ్  పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన స్పెషల్ వీడియోని ఇంతకుముందే రిలీజ్ చేశారు మేకర్స్.  కానీ ఎన్టీఆర్ పుట్టినరోజున ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకి గురయ్యారు. ఈ క్రమంలో మూవీ యూనిట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అంటూ ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అలియా భట్, అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ 2022 జనవరిలో విడుదల కానుందని అంచనా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా