ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా.. దసరా రేసులో యంగ్‌ హీరోలు!

29 Aug, 2021 17:35 IST|Sakshi

RRR Movie Postponed: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసం యావత్‌ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్‌ చెబుతూ వచ్చారు. దీనికి  తగ్గట్లుగానే ప్రతి పోస్టర్ లోనూ అదే తేదీని వేస్తూ సినీ అభిమానుల్లో ఆశ కల్పించారు. కాని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ని దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని వాయిదా వేయ‌నున్న‌ట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. అందుకే దసరా రేసులో కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. 

అక్టోబర్ 8న కొండపొలం రిలీజ్ చేస్తున్నట్లు క్రిష్ ప్రకటించాడు.రిలీజ్ డేట్ లాక్ చేసిన వెంటనే, ప్రమోషన్ స్టార్ట్ చేసాడు.మూవీ నుంచి ఓబులమ్మ ఫుల్ వీడియో సాంగ్ రిలీజైంది.ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.

ఇప్పుడు కొండపొలంకు పోటీగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కూడా అక్టోబర్‌ 8న  రిలీజ్ అవుతోంది. గతేడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా చాలా కాలంగా పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తోంది. గీతా ఆర్డ్స్ నిర్మిస్తున్న ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ లో ఫస్ట్ బిగ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అఖిల్ ఈ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. టాలీవుడ్ హ్యాపెనింగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

అక్టోబర్ 14న శర్వానంద్, సిద్ధార్ద్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ ‘మహా సముద్రం’విడుదల కానుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదితీరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. 

మొత్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ బాక్సాఫీస్‌ రేస్‌ నుంచి తప్పుకుందనే రూమర్స్‌కే ఇన్ని సినిమాలు దసరా సీజన్ కు ఖర్చీఫ్ వేస్తోంటే, ఒకవేళ అఫీసియల్ ఎనౌన్స్ మెంట్ వస్తే మాత్రం మరిన్ని భారీ చిత్రాలు బాక్సాఫీస్ రిలీజ్ కన్ ఫామ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు