ఆర్ఆర్ఆర్ నిర్మాతకు క‌రోనా పాజిటివ్‌

7 Aug, 2020 19:31 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: టాలీవుడ్‌కు క‌రోనా గండం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే దర్శ‌కుడు తేజ‌, ఆర్ఆర్ఆర్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, సింగ‌ర్ స్మిత‌ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దాన‌య్య‌కు క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది.. ఆయ‌న 'జంబ‌ల‌కిడి పంబ' అనే వైవిధ్య‌భ‌రిత‌మైన‌ కామెడీ చిత్రంతో నిర్మాత‌గా వెండితెర‌పై ప్ర‌వేశించారు. అది సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించ‌డంతో తొలి చిత్రంతోనే హిట్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న నిర్మించిన‌ మావిడాకులు, స‌ముద్రం కూడా ప్రేక్ష‌కు మ‌న‌సు గెలుచుకున్నాయి. దాన‌య్య‌ చివ‌రిసారిగా 'విన‌య విధేయ రామ' చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. (నిర్మల్‌ బొమ్మ నేపథ్యంలో...)

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ఈ పాటికే ప్ర‌క‌టించింది. షూటింగ్ కూడా 70 శాతానికి పైగా పూర్తి కాగా గ్రాఫిక్ వ‌ర్క్ ఇంకా మిగిలే ఉంది. ఇంత‌లో ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న‌కు, నిర్మాత దాన‌య్య‌కు క‌రోనా రావ‌డంతో ప‌నులు మ‌రింత ఆల‌స్య‌మ‌య్యేలా ఉంది. దీంతో చెప్పిన స‌మ‌యానికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారా? లేదా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదైతేనేం కానీ, ఈ ఇద్ద‌రూ క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాలంటూ సినీ న‌టులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. (ఆర్‌ఆర్‌ఆర్: అన్నీ సవ్యంగా సాగి ఉంటేనా!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు