ఆర్ఆర్ఆర్ సాంగ్.. టెస్లా కార్ల స్టెప్పులు అదుర్స్

20 Mar, 2023 14:44 IST|Sakshi

ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆ పాటకు స్టెప్పులేయకుండా ఎవరు మాత్రం ఉండగలరు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవేదికపై తెలుగోడి సత్తాను చాటింది. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.  ఎలన్ మస్క్‌కు చెందిన కార్ల కంపెనీ టెస్లాలో నాటు నాటు సాంగ్‌ ఊర్రూతలూగించింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

టెస్లా కార్లకు ఉన్న లైట్లు నాటు నాటు స్టెప్పులతో సింక్ అయ్యేలా ప్రదర్శించారు. పాట లిరిక్స్‌కు అనుగుణంగా కార్ల లైట్స్‌ వెలగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతే కాకుండా పక్కన ఉన్న టెస్లా ఉద్యోగులు సైతం కాలు కదపకుండా ఉండలేకపోయారు. నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ లైట్‌ షో నిర్వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్,  సీమాంధ్ర అసోసియేషన్‌ సభ్యులు వంశీ కొప్పురావూరి, ఉజ్వల్ కుమార్ కస్తల ఈ కార్యక్రమం సక్సెస్ లో ప్రముఖ పాత్రను వహించారు. ఎడిసన్ నగర మేయర్‌ సామ్‌ జోషి మరియు అతని బృందం అతి తక్కువ టైములో సహకరించి దీనిని విజయవంతం చేసారు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని వార్తలు