SS Rajamouli: ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న జక్కన్న

5 Jan, 2023 17:19 IST|Sakshi

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. బాహుబలి సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో సంచలనమే సృష్టించాడు. ఈ సినిమాకు కలెక్షన్ల వర్షంతో పాటు అవార్డుల పరంపర కూడా తోడైంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చి చేరింది.

న్యూయార్క్‌ ఫిలిం క్రిటిక్స్‌ సర్కిల్‌(NYFCC) ఉత్తమ దర్శకుడిగా జక్కన్న అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని భారతీయులు ఎంతలా ఆస్వాదించారో ఇక్కడివారు కూడా అదే స్థాయిలో ఆదరించారు. నా సినిమాను ప్రేక్షకులు మనసారా ఎంజాయ్‌ చేస్తుంటే అంతకన్నా ఏం కావాలి?' అని చెప్పుకొచ్చాడు. ఈ అవార్డుల ఫంక్షన్‌కు రాజమౌళి భారతీయ సాంప్రదాయాన్ని చాటేలా ధోతి, కుర్తాలో హాజరయ్యాడు. తన సతీమణి రమతో కలిసి అవార్డు అందుకున్నాడు.

చదవండి: సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌ అద్దె ఎన్ని లక్షలో తెలుసా?

మరిన్ని వార్తలు