Ram Charan: ఆయనతో కలిసి పనిచేసే ఛాన్స్‌ వస్తే అదే గొప్ప: రామ్‌చరణ్‌

9 Mar, 2023 18:39 IST|Sakshi

నాటు నాటు ప్రజల హృద‌యాల‌ను గెలుచుకున్న పాట‌

హాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌ని ప్రేమ‌తో చాలెంజ్ చేయాల‌నుకుంటున్నా

గ్లోబ‌ల్ ఆడియెన్స్ ఇష్ట‌ప‌డే ఫ్రాంచైజీ చిత్రాల్లో భాగం కావాల‌నుకుంటున్నా

ఎంటర్‌టైన్‌మెంట్‌ టునైట్‌ ప్రోగ్రామ్‌లో రామ్‌చరణ్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారాడు రామ్‌చరణ్‌. ప్రస్తుతం అమెరికాలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న ఈ హీరో తాజాగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ టు నైట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆదివారం జ‌ర‌గ‌బోయే ఆస్కార్ ఈవెంట్ కోసం చరణ్‌ను ఇంట‌ర్వ్యూ చేశారు వ్యాఖ్యాత యాష్ క్రాస‌న్. ఈ సంద‌ర్భంగా ‘నాటు నాటు’ పాట సాధించిన ఘ‌న‌త గురించి చ‌ర‌ణ్ ప్ర‌స్తావించాడు.

‘నాటు నాటు’ పాట కేవలం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోనిది మాత్రమే కాదు, ఇది అంద‌రి పాట‌. భిన్న సంస్కృతుల‌కు చెందిన వేర్వేరు వ‌య‌సుల‌కు చెందిన‌వారు పాట‌లోని సాహిత్యం అర్థం కాన‌ప్ప‌టికీ త‌మ పాట‌గా స్వీక‌రించారు. జపాన్ నుంచి యూఎస్ వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ పాట‌ను ఇష్ట‌ప‌డ్డారు. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని నిజం. ఇంత కంటే గొప్ప‌గా ఏదీ కోరుకోను. ఉక్రెయిన్‌లోని ప్రెసిడెంట్‌ ప్యాలెస్ ముందు వారం రోజుల పాటు నాటు నాటు పాట‌ను రిహార్స‌ల్ చేశాం. అక్క‌డి ప్రెసిడెంట్ కూడా ఓ న‌టుడే. కాబ‌ట్టి ఆయ‌న అక్క‌డ షూటింగ్ చేసుకుంటామ‌నే మా అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించారు. పాట చిత్రీక‌ర‌ణ‌లో నూట యాబై మంది డాన్స‌ర్స్ సెట్‌లో పాల్గొన్నారు. ఇంకా 200 మంది యూనిట్ స‌భ్యులున్నారు. ఆ పాట‌ను చిత్రీక‌రించ‌టానికి 17 రోజుల స‌మయం ప‌ట్టింది. డాన్స్ చేసే క్ర‌మంలో చాలా రీటేక్స్ తీసుకున్నాం. నేనైతే నాలుగు కిలోల బ‌రువు త‌గ్గిపోయాను. ఆ కష్టం గురించి ఇప్పుడాలోచించినా నా కాళ్లు వ‌ణుకుతాయి.

నా నుంచి, నా స‌హ న‌టుడు (ఎన్టీఆర్‌) నుంచి ఎలాంటి ఔట్ పుట్ రావాల‌నే దానిపై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు. మా డ్యాన్స్ మూమెంట్స్ ల‌య బ‌ద్ధ‌త‌, ప్ర‌తీ ఫ్రేమ్ ప‌ర్‌ఫెక్ట్‌గా ఉండాల‌ని మా డైరెక్ట‌ర్ చాలా ప‌ర్టిక్యుల‌ర్‌గా ఉండేవారు. ఆయ‌న ఆ స‌మ‌యంలో మ‌మ్మ‌ల్ని ఎంత హింస పెట్టినా దానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ద‌క్కింది (న‌వ్వుతూ). నేను రాజ‌మౌళిగారితో ఎప్పుడు ప‌ని చేసినా నా బ్రెయిన్‌ని స్విచ్ ఆఫ్ మోడ్‌లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఆయ‌న మ‌న‌సులో ఏముందో మ‌నం ఊహించ‌లేం. అలాగే ఆయ‌న ప‌నిలో చాలా నిష్ణాతుడు. ఓ టెక్నీషియ‌న్‌గా త‌న‌కేం కావాలో బాగా తెలుసు.

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోతున్న ఆస్కార్ అవార్డ్స్ కార్య‌క్ర‌మం సంద‌ర్బంగా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. ఓ న‌టుడిగా అక్క‌డ ఉంటానో లేక ఫ్యాన్ బాయ్‌గా ఉంటానో తెలియ‌టం లేదు. ఎందుకంటే నేను ఎవ‌రినైతే చూస్తూ పెరిగానో వారంద‌రినీ అక్క‌డ చూడ‌బోతున్నాను. అది తలుచుకుంటేనే చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంది. కేట్ బ్లాంచెట్‌, టామ్ క్రూయిజ్‌ వంటి వారి సినిమాలు చూస్తూ పెరిగాను. టామ్ క్రూయిజ్ చాలా గొప్ప వ్య‌క్తి. ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం వ‌స్తే చాలా గొప్ప‌. ఆయ‌నెంతో స్ఫూర్తిదాయ‌క‌మైన వ్య‌క్తి.

ఆస్కార్ అవార్డుకి మా సంగీత ద‌ర్శ‌కులు ఎం.ఎం.కీర‌వాణిగారు అర్హులు. ఆయ‌న త‌న రంగంలో 27 ఏళ్లుగా రాణిస్తున్నారు. ఇన్నేళ్ల‌కు ఆయ‌న‌కు ఆస్కార్ అవార్డ్ వ‌స్తుంది. కీర‌వాణిగారికి స‌పోర్ట్ చేయ‌టానికి ఓ కుటుంబంలాగా మేమంతా ఇక్క‌డ‌కు వ‌చ్చాం. ఆర్‌ఆర్‌ఆర్‌ గొప్ప క‌ళాత్మ‌క చిత్రం.. దీని ప‌రంగా మాకు ఆశించిన దాని కంటే ఎక్కువ ప్రేమ‌, అభినంద‌న‌లు ద‌క్కాయి. ఇప్పుడేదైతే ద‌క్కుతుందో అదంతా అద‌నం. మేం ఈ క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తున్నాం. నేను హాలీవుడ్‌లో చాలా మంది ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేయాల‌నుకుంటున్నాను. వారిలో జె.జె.అబ్ర‌మ్స్ ఒక‌రు. క్వాంటిన్ ట‌రాన్‌టినో నాకు ఎంతో ఇష్ట‌మైన‌ మూవీ. ఆయ‌న డైరెక్ట్ చేసిన వార్ మూవీ ఇన్‌గ్లోరియ‌స్ బాస్టర్ట్స్ నా ఆల్ టైమ్ ఫేవ‌రేట్ మూవీ. ఆయ‌న నాపై ఎంతో ప్ర‌భావాన్ని చూపారు. ఈ ద‌ర్శ‌కులు వారితో ప‌ని చేసే న‌టుల‌కు స‌వాలు విసురుతుంటారు అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు