ఆర్ఆర్ఆర్ టీం : రాజమౌళిపై ఇన్ని ఆరోపణలా! 

10 Oct, 2020 14:01 IST|Sakshi

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళికి  ఆర్ఆర్ఆర్ టీం  స్పెషల్ విషెస్

"ప‌ర్‌ఫెక్షన్‌తో చావగొట్టేస్తున్నాడు'' :  ఎన్టీఆర్ చిరు కోపం

సాక్షి, హైదరాబాద్: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళికి ఆర్ఆర్ఆర్ టీం వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు మూవీ టీం ఒక వీడియో విడుదల చేసింది. ప్ర‌తి సీన్‌ని పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేయాల‌ని అనుకుంటారు. ఎమోషన్స్ రూపంలో సినిమా థ్రిల్స్ ఇవ్వడానికి ఇష్టపడే దర్శకుడు అంటూ ప్రశంసిస్తూ ఆయనకు ఒక చిరు కానుకను అందించింది. హ్యాపీ బర్తడే సార్.. లాంగ్ లివ్ సార్ అంటూ రొటీన్ డైలాగులకు భిన్నంగా ఆయన పనితీరును, ఆయనలోని నిబద్ధతను ఎలివేట్ చేస్తూ, ప‌ర్‌ఫెక్షనిజానికి ఫిదా అవుతూ వర్చువల్ విషెస్ చెప్పడం ఆసక్తికరంగా నిలిచింది. (ఆర్ఆర్ఆర్ అప్‌డేట్ వచ్చేసింది)

ముఖ్యంగా మెగాహీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. దర్శక రాక్షసుడు చంపేస్తున్నారంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.  ఒక్క షాట్ కు మూడుగంటలు.. అదీ జక్కన్న చెక్కుడు.. ఆయన ప‌ర్‌ఫెక్షన్‌తో మమ్మల్ని చావగొట్టేస్తున్నారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అంతేనా సంగీత దర్శకుడు కీరవాణి, సెంథిల్ కుమార్‌తో పాటు చిత్ర బృందం చేసిన చిలిపి ఆరోపణలను ఒకసారి మీరు కూడా చూసేయండి మరి. మరోవైపు బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన  దర్శక ధీరుడు రాజమౌళికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నటీనటులుతో పాటు, ఇతర సెలబ్రిటీలు,  అభిమానుల అభినందనల వెల్లువ కురుస్తోంది. 

మరిన్ని వార్తలు