‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో పోస్టర్‌.. దేశభక్తి మూవీ కాదు

11 Oct, 2020 17:37 IST|Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను ఆర్ఆర్ఆర్ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టర్‌లో వెనుక అశోక ధర్మ చక్రం, ముందు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ చేతులు కలిపినట్లుగా ఉంది.  
(చదవండి : ఆర్ఆర్ఆర్ టీం : రాజమౌళిపై ఇన్ని ఆరోపణలా! )

ఈ పోస్టర్ కు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఈ లుక్‌ చూసినవారిలో కొందరు 'ఆర్‌ఆర్ఆర్‌' చిత్రంలో ఎన్టీఆర్‌, చరణ్‌లు కలిసి స్వాతంత్య్ర కోసం పోరాడుతారని కామెంట్స్‌ పెట్టారు. దీనిపై చిత్ర బృందం క్లారీటీ ఇచ్చింది. ‘ఆర్‌ఆర్ఆర్‌’ లో ఎన్టీఆర్‌, చరణ్‌లు కలుసుకుంటారని, ఫొటోలో ఉండేది వారి చేతులే పేర్కొంది. కానీ ఇది దేశ భక్తి సినిమా కాదని, ఫిక్షనల్‌ మూవీయే అని మరోసారి స్పష్టం చేసింది. 

 ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు.  ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కి జోడీగా హిందీ నటి ఆలియా భట్‌ కనిపించనున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు