ఆర్ఆర్ఆర్ కథపై నెటిజన్ సందేహం.. అదిరిపోయే రిప్లై వచ్చిందిగా

10 Nov, 2021 13:08 IST|Sakshi

టాలీవుడ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానోఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి టేకింగ్ , మరో వైపు టాప్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు లేదు. గతంలో రాజమౌళి మ‌న‌కు తెలిసిన కథ కాకుండా ఫిక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నట్లు చెప్పక్కనే చెప్పారు. అయితే జక్కన సినిమా అంటే రకరకాల ఉహాగానాలు రావడం సహజమే. తాజాగా ఓ నెటిజన్ ఈ సినిమాపై చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.  

ఆ ట్వీట్ లో.. 1920 లో స్వాతంత్ర స‌మ‌ర‌యోధులు ఇంటి నుంచి వెళ్లిన వాళ్ళు రెండేళ్ళ అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ రెండేళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలీదు కాబట్టి ఆ పార్ట్ ని ఫిక్షన్ గా తెరకెక్కించాలని రాజ‌మౌళి అనుకున్నాడని చెప్పాడు. అయితే జక్కన్న మనకు తెలిసిన కథని కూడా ఏమైనా మార్పులు చేర్పులు చేసి  చూపిస్తున్నారా అంటూ తన సందేహాన్ని వ్యక్తం చేశాడు ఆ నెటిజన్ . దీనికి ఆర్ఆర్ఆర్ టీమ్ ట్వీటర్ లో  ఫ‌న్నీగా రిప్లై ఇచ్చింది. ‘ ఓరీ మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. డైరెక్టర్ రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా క్లియర్ గా.. మీకు తెలిసిన స్టోరీ ఏదీ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉండదు. మైండ్ లో నుండి అవ్వన్నీ తీసేసీ హాయిగా సినిమాను ఎంజాయ్ చేయండి అన్నారు.

చదవండి: Anasuya: అవసరమైతే గుండు కొట్టించుకోడానికి రెడీ అంటున్న యాంకర్‌ అనసూయ

మరిన్ని వార్తలు