రాధేశ్యామ్‌ : ప్రభాస్ కాస్ట్యూమ్స్‌ కోసం 6కోట్లు!

16 Feb, 2021 17:04 IST|Sakshi

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాధేశ్యామ్‌లో ప్రభాస్‌ లుక్‌ చాలా కొత్తగా ఉంటుందని, కేవలం ప్రభాస్‌ కాస్ట్యూమ్స్‌ కోసమే నిర్మాతలు 6కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డిజైనర్‌ టీం పని చేసిందని, ప్రభాస్‌ కెరియర్‌లోనే అత్యంత కాస్ట్‌లీ కాస్టూమ్స్‌ ఇవేనని సమాచారం. యూరప్ నేపథ్యంలో వింటేజ్ పిరియాడికల్ కథకు తగ్గట్లు ప్రభాస్‌ లుక్‌ కోసం చాలా జాగ్రత్తలు పాటించారట మూవీ టీం. 

ఈ సినిమాలో  ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో  జూలై 30న ఈ సినిమా రిలీజ్‌  చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే  ప్రకటించింది. ఈ సినిమా విడుదలైన  పది రోజులకే అంటే ఆగస్టు 11న ప్రభాస్‌ మరో చిత్రం ఆదిపురుష్‌ విడుదల కానుండటం గమనార్హం.
 

చదవండి : (ప్రేమ కోసం చచ్చే టైప్‌ కాదంటున్న ప్రభాస్‌)
(‘సలార్‌‌’ స్పెషల్‌ సాంగ్‌లో ప్రియాంక చోప్రా!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు