బిగ్‌బాస్‌ విన్నర్‌కు కరోనా, భావోద్వేగంతో వీడియో షేర్‌ చేసిన నటి

18 May, 2021 16:14 IST|Sakshi

హిందీ బిగ్‌బాస్‌ 14 విన్నర్‌, నటి రుబినా డిలైక్‌ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిమ్లాలోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్న రుబినా మంగళవారం ఓ వీడియో షేర్‌ చేసింది. ఈ నెల ఒకటో తేదీన తను కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపింది. కరోనా అని తెలిసినప్పటి నుంచి హెం క్వారంటైన్‌లో ఉంటూ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తుందో ఆమె వీడియోలో వివరించింది.

రుబినా తన యూట్యూబ్‌ ఛానల్‌లో కోవిడ్‌ డైరీస్‌ అనే పేరుతో ఈ వీడియోను షేర్‌ చేస్తూ... కోవిడ్‌ నుంచి కోలుకునేందుకు తన భర్త అభివనవ్‌, తల్లి, సోదరి ఎంతటి మద్దతు ఇచ్చారో చెబుతూ ఇలాంటి కుటుంబ ఉన్నందుకు తాను చాలా అదృష్టావంతురాలినంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. అనంతరం తన కోసం ప్రార్థిస్తున్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

ఎవరైనా కరోనా లక్షణాలు, జ్వరంతో బాధపడితే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, దీనిని సాదారణ ఫ్లూగా చూడోద్దంటూ ఆమె అభ్యర్థించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, కానీ ఊపిరిత్తిత్తుల్లో కాస్తా ఇన్ఫెక్షన్‌ ఉందని ఈ సందర్భంగా రుబినా వెల్లడించింది. ఇక తాను కరోనా నుంచి కోలుకున్న అనంతరం ప్లాస్మా దానం చేయాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పింది.

చివరగా ఆమె.. దయ చేసి ప్రతి ఒక్కరు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం పని కంటే ఆరోగ్యం చాలా ముఖ్యమని, జీవితం అనేది ఉంటేనే ప్రపంచంలో మిగతావన్ని ఉంటాయని ఆమె హెచ్చరించింది. కాగా రుబినా తన భర్త, నటుడు అభినవ్‌తో బిగ్‌బాస్‌ 14 సిజన్‌లో కంటెస్టెంట్‌​ వచ్చిన సంగతి తెలిసిందే. హౌజ్‌లో తనశైలితో వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ సిజన్‌ విన్నర్‌గా ఆమె నిలిచింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు