‘గాడు బలవంతుడే రా.. కానీ నేను భగవంతుడు రా..’ ఆసక్తికరంగా టీజర్‌

17 Apr, 2023 04:35 IST|Sakshi
విమలా రామన్, జగపతిబాబు, మమతా మోహన్‌దాస్‌

‘మై నేమ్‌ ఈజ్‌ భీం రావ్‌ దేశ్‌ముఖ్‌..’ అనే జగపతిబాబు డైలాగ్‌తో ‘రుద్రంగి’ సినిమా టీజర్‌ విడుదలైంది. జగపతి బాబు, ఆశిష్‌ గాంధీ, మమతా మోహన్‌ దాస్, విమలా రామన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన అజయ్‌ సామ్రాట్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రసమయి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ నిర్మిస్తున్న ఈ మూవీ మే 26న విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది.

‘స్వాతంత్య్రం అన్నది బానిసలకు కాదు.. అది మా కోసం’, ‘గాడు బలవంతుడే రా.. కానీ నేను భగవంతుడు రా..’(జగపతి బాబు), ‘నీకు ఎదురు తిరిగిన మల్లేశ్‌గాడు ఖతం కావాలె(మమతా మోహన్‌ దాస్‌) వంటి డైలాగులు టీజర్‌లో ఉన్నాయి. స్వాతంత్య్రం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు టీజర్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్‌ శనమోని, సంగీతం: నాఫల్‌ రాజా.

మరిన్ని వార్తలు