HER Movie: రెండు నెలల తర్వాత ఓటీటీలో ప్రత్యక్షమైన మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

15 Sep, 2023 15:35 IST|Sakshi

సినిమాలు థియేటర్లలో రిలీజవ్వడం ఎంత ముఖ్యమో ఓటీటీలో విడుదలవడం కూడా అంతే ముఖ్యమైపోయింది. ఎల్లప్పుడూ జనాలకు అందుబాటులోకి ఉండేందుకు ఓటీటీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కొన్ని చిత్రాలు థియేటర్‌లో విడుదలైన రెండు, మూడు వారాలకు ఓటీటీ డేట్‌ చెప్పి మరీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. మరికొన్ని మాత్రం గప్‌చుప్‌గా ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి.

కట్టప్ప సత్యరాజ్‌ తనయుడు సిబి సత్యరాజ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మాయోన్‌ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే కదా! ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తాజాగా మరో థ్రిల్లర్‌ మూవీ ఓటీటీలో ప్రత్యక్షమై సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. అదే 'హర్‌'. రుహాని శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను శ్రీధర్‌ స్వరాఘవ్‌ డైరెక్ట్‌ చేశారు. డబుల్‌ అప్‌ మీడియాస్‌పై రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. జూలై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది.

హర్‌ సినిమా కథేంటంటే..
ఏసీపీ అర్చన ప్రసాద్ (రుహానీ శర్మ).. కేశవను పట్టుకునే ఆపరేషన్‌లో భాగంగా తన ప్రియుడైన శేషాద్రి (వికాస్ వశిష్ట)ను పోగొట్టుకుంటుంది. తర్వాత ఆమె ఆరు నెలలు సస్పెన్షన్‌కు గురవుతుంది. డ్యూటీలో తిరిగి జాయిన్ అయ్యే టైంలోనే సిటీలో రెండు హత్యలు జరుగుతాయి. విశాల్, స్వాతి హత్యలను చేధించే సమయంలో కేశవకు సంబంధించిన లింక్ దొరుకుతుంది. మరి అర్చన.. కేశవను పట్టుకుందా? సిటీలో జరిగిన రెండు హత్యలకు ఏదైనా కనెక్షన్‌ ఉందా? ఈ కేసును ఆమె ఎలా పరిష్కరించింది? అనే విషయాలు తెలియాలంటే ఓటీటీలో చూసేయండి.

చదవండి: లక్షలు మోసపోయాడు, ఇంట్లోకే రానన్నాడు, పెళ్లెప్పుడంటే.. పల్లవి ప్రశాంత్‌ పేరెంట్స్‌

మరిన్ని వార్తలు