అందాల మోహిని

9 Oct, 2020 01:23 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ రుహీ సింగ్‌ ‘మోసగాళ్లు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ఇది. ఇందులో విష్ణు సరసన రుహీ సింగ్‌ నటించారు. ఆమె పాత్ర పేరు మోహిని. ఈ సినిమాలో రుహీ గ్లామరస్‌గా కనిపిస్తారని గురువారం విడుదల చేసిన మోహిని లుక్‌ స్పష్టం చేస్తోంది.  హాలీవుడ్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ‘ది వరల్డ్‌ బిఫోర్‌ హర్‌’ (2012)తో కెరీర్‌ను ప్రారంభించిన రుహీ సింగ్‌ తర్వాత హిందీలో ‘క్యాలండర్‌ గర్ల్స్‌’, ‘ఇష్క్‌ ఫరెవర్‌’ చిత్రాల్లో నటించారు. ‘మోసగాళ్లు’తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న రుహీ సింగ్‌ ‘ఈ సినిమాలో నటించడం చాలా కిక్‌ ఇచ్చింది. మోహిని పాత్ర చేయడం చాలా సరదాగా అనిపించింది’ అన్నారు.

మరిన్ని వార్తలు