Rukmini Kota: పవన్‌ కల్యాణ్‌ చుట్టూ 'రుక్మిణి' కోట.. ఎంతటి వారైనా పవన్‌ను కలవాలంటే జరిగేది ఇదేనా?

24 Oct, 2023 13:47 IST|Sakshi

జ‌న‌సేన పార్టీలో కీలక నాయకుల పేర్లు చెప్పమని ఎవరినైనా అడిగితే పట్టుమని ఇదు పేర్లు కూడా తెరపై కనిపించవు. పవన్‌ పల్లకీ మోస్తున్న ఆయన అభిమానులకు కూడా ఈ విషయం తెలుసు. పవన్‌ తర్వాత పార్టీలో ఎక్కువగా వినిపించే పేరు నాదెండ్ల మ‌నోహ‌ర్‌ కానీ ఆ జాబితాలో రుక్మిణి కోట అనే యువతి కూడా చేరారు. నిన్న మొన్న‌టి వ‌రకు నాదెండ్ల ఏది చెబితే అదే జనసేనలో నడిచేది.. కానీ ఇప్పుడు ఆ సీన్‌ మారిపోయింది.

తాజాగా రాయ‌ల‌సీమ జిల్లాల మ‌హిళా నాయకురాలు ప‌సుపులేటి ప‌ద్మావ‌తి జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. త‌న రాజీనామా లేఖ‌లో 140 రోజుల పాటు రుక్మిణి ఎలా ఆడుకున్నారో క్లియర్‌గా వివ‌రించారు. ఇలా బ‌య‌టికి చెప్పుకోలేని వాళ్లు చాలా మంది జనసేనలో ఉన్నారని రుక్మిణి పేరు చెబుతూనే ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారు.

రుక్మిణి కోట ఎవరు..?

కృష్ణా జిల్లాకు చెందిన రుక్మిణి లండ‌న్‌లో ఉండేవారు. అక్కడ ఆమె ప్రముఖ బ్రాండెడ్‌ బట్టల షాపును రన్‌ చేసేవారట. ప‌వ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన‌ప్పుడు ఆయ‌న‌కు ద‌గ్గ‌రుండి సౌక‌ర్యాలు క‌ల్పించేవార‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్న మాట‌. ఈ నేప‌థ్యంలో 2020లో ఆమెను జ‌న‌సేన సెంట్ర‌ల్ అఫైర్స్ క‌మిటీ వైస్ చైర్మ‌న్‌గా ప‌వ‌న్ నియ‌మించారు. వాస్తవానికి జ‌న‌సేన నియామ‌కాల‌ను ప‌రిశీలిస్తే ఎక్కువగా విదేశాల్లోనే ఉంటాయి. పార్టీ కోసం ఫండ్స్‌ పేరుతో పవన్‌,నాగబాబు కూడా ఇప్పటికే పలు పర్యటనలు కూడా చేసిన విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: మెగా 156 ప్రారంభం.. వీడియోతో ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి)

జ‌న‌సేన వీర‌మ‌హిళ‌ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దానికి దిశానిర్దేశం చేస్తున్నది కూడా రుక్మిణినే అని వారు చెబుతుంటారు. 2020 నుంచే రుక్మిణి పార్టీలో ఉన్నప్పటికీ 2022లో ఆమె లండ‌న్ నుంచి హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చారు. ఇక్కడి వచ్చాక ఆమెకు హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన కార్యాల‌య బాధ్య‌త‌ల్ని మొదటగా రుక్మిణికి ప‌వ‌న్ అప్ప‌గించారు. ఆమె టాలెంట్‌తో పవన్‌ను మెప్పించడంతో పార్టీలో ఆమె కీలకంగా మారిపోయారని టాక్‌. ఈ నేప‌థ్యంలో ఆప్పటికే జనసేన పార్టీ ఆఫీస్‌లో పనిచేసే 30 మందిని ఒక్కసారిగా తొలగించేశారని సమాచారం. వారి స్థానంలో తనకు సంబంధించిన వ్యక్తులను రుక్మిణి ఏర్పాటుచేసుకున్నారని తెలుస్తోంది.

ప‌వ‌న్‌ను క‌ల‌వాలంటే జ‌న‌సేన‌లో ఎంత పెద్ద పాలెగాడైనా రుక్మిణిని దాటుకుని మాత్రమే వెళ్లాలట. ఎంతటివాడైనా డోంట్‌ కేర్‌ ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తేనే ప‌వ‌న్ వ‌ద్ద‌కు ఎంట్రీ దొరుకుందట. లేదంటే జ‌న‌సేన కార్యాల‌యం గేటు కూడా తాకలేరట. ఇదే విషయాన్ని జనసేనకు రాజీనామ చేసిన ప‌సుపులేటి ప‌ద్మావ‌తి తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీలో ఎంతపెద్ద తోపు నాయకుడు అయినా పవన్‌ను కలవాలంటే రుక్మిణి... రుక్మిణి.. అంటూ ప్రదక్షణలు చేసుకోవాల్సిందేనట.

(ఇదీ చదవండి: పవన్‌ కల్యాణ్‌ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్‌)

అలా జ‌న‌సేన శ్రేణుల‌కు ప‌వ‌న్‌ క‌ల్యాణ్ దేవుడైతే.. భ‌క్తుల‌కు , ఆయ‌న‌కు మ‌ధ్య అనుసంధాన‌క‌ర్తగా రుక్మిణి అని జ‌న‌సేన నాయ‌కులు స‌ర‌దాగా చెబుతున్న మాట. ఆమె అనుమతి లేకుండా పార్టీలో ఏ ఒక్క చిన్న పని కూడా జరగదట. రుక్మిణి స్పీడ్‌ ముందు నాదెండ్ల మనోహర్‌ పరిస్థితి ఎలా ఉందో అంటూ ఆ పార్టీలో గుసగుసలు స్టార్ట్‌ అయ్యాయి

మరిన్ని వార్తలు