సినిమా అంటే సులభం కాదు   – నిర్మాత ఏఎం రత్నం 

2 Oct, 2023 01:41 IST|Sakshi
రత్నం కృష్ణ, నేహాశెట్టి, కిరణ్‌ అబ్బవరం, ఏఎం రత్నం

‘‘రాజకీయం, వ్యాపారం..  ఇలా అన్నిరంగాలపై అవగాహన ఉన్నవాళ్లే మూవీస్‌ చేయగలరు. సినిమా అంత సులభం కాదు.. ఖర్చు, రిస్క్‌తో కూడిన పని. అయినా నేను ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్విస్తున్నాను. కిరణ్‌తో మరో సినిమా చేస్తా.. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం చేస్తాను’’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన  చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’.

ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకి నిర్మాతలు ఏఎం రత్నం, అంబికా కృష్ణ, దర్శకుడు అనుదీప్‌ కేవీ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ‘‘పక్కా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. నేను సిక్స్‌ కొట్టడానికి దొరికిన లాస్ట్‌ బాల్‌ ఇది.. తప్పకుండా సిక్సర్‌ కొడతా’’ అన్నారు రత్నం కృష్ణ. ‘‘నిర్మాణ రంగంలో ఏఎం రత్నంగారు మాకు అండగా ఉన్నారు’’ అన్నారు మురళీకృష్ణ వేమూరి. ‘‘నేను నటించిన పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా ఇది’’ అన్నారు కిరణ్‌ అబ్బవరం.

మరిన్ని వార్తలు