ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఎన్టీఆర్‌ మూవీ..?!

31 Mar, 2021 00:14 IST|Sakshi

‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి హిట్‌ సినిమా తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటల్‌ పరిశీలనలో ఉందనే వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. తాజాగా మరో కొత్త టైటిల్‌ తెరపైకి వచ్చింది. ‘చౌడప్ప నాయుడు’ అనే పేరును టైటిల్‌గా అనుకుంటున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి.

మరి.. ‘అయినను...’, ‘చౌడప్ప...’ ఈ రెంటిలో ఏ టైటిల్‌ని ఫిక్స్‌ చేస్తారు? ఈ రెండూ కాకుండా వేరే టైటిల్‌ పెడతారా చూడాలి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్‌. ఈ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ సినిమాని ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించనున్నారట త్రివిక్రమ్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి విలన్‌గా‌ విజయ్‌ సేతుపతి నటించబోతున్నట్టు గతంలో వార్తలొచ్చాయి.. తాజాగా సైఫ్‌ అలీఖాన్‌ పేరు వినిపిస్తోంది. 

మరిన్ని వార్తలు