రూపా దత్తా లైంగిక ఆరోపణలు : నిజమేనా?

23 Sep, 2020 12:57 IST|Sakshi

రూపా దత్తా తప్పులో కాలేశారా? లేక కావాలనే ఆరోపణలు చేశారా

సాక్షి, ముంబై: మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మీటూ ఉద్యమం తరువాత తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. హీరోయిన్ పాయల్ ఘోష్ ఆరోపణల అనంతరం బెంగాలీ నటి రూపా దత్తా కూడా ఇదే ఆరోపణలతో ముందుకు వచ్చారు. అయితే ఇక్కడే తీవ్ర గందరగోళం  ఏర్పడింది. అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడంటూ దీనికి సంబంధించిన అనురాగ్ సఫర్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ చాట్ స్క్రీన్ షాట్స్ షేర్ చేయడంతో పెద్ద దుమారమే రేగుతోంది. మరోవైపు కశ్యప్‌కు స్త్రీల పట్ల ఏ మాత్రం గౌరవం లేదంటూ పాయల్ ఘోష్ ఆరోపణలను గట్టిగా సమర్ధించారు రూపా. అంతేకాదు ఆయన డ్రగ్స్ కూడా తీసుకుంటారని, కఠినంగాశిక్షించాలని కోరారు. ఎన్‌సీబీ తనిఖీలు చేపట్టాలని ట్వీట్ చేశారు. తాజా పరిణామంపై రూపా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. (వాళ్లిద్దరికీ అతడితో సంబంధం: నటి స్పందన)

అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన రూపా దత్తా ... అనురాగ్ సఫర్ 2014 నాటి ఛాటింగ్ షేర్ చేయడం సరికొత్త వివాదాన్ని రేపింది.  ఐర్లాండ్ కు చెందిన అనురాగ్ సఫర్ 2010, సెప్టెంబరు చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. తాను దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను కాదని తనకూ అనురాగ్ కశ్యప్ కు సంబంధం లేదనే ఆ సమాచారాన్ని ట్వీట్ చేశాడు. అనురాగ్ సఫర్కి గతంతో అనురాగ్ కశ్యప్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఉండేదని, పలు మీడియా సంస్థలు కూడా అతడిని కశ్యప్ గా భావించడంతో ఈ క్లారిటీ ఇచ్చినట్టు  సమాచారం.

కాగా పాయల్ ఘోష్ ఫిర్యాదు ఆధారంగా మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు. అయితే మీరు గొప్ప స్త్రీవాది అంటూ తాప్సీ పన్ను కశ్యప్‌కు కితాబివ్వడం విశేషం. ఈ ఆరోపణలు రుజువైతే కశ్యప్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటానని తాప్సీ ప్రకటించారు. మీటూ ఉద్యమానికి చెడ్డపేరు తేవద్దంటూ నటి స్వర భాస్కర్ కూడా రూపాను తప్పుబట్టారు. అలాగే సైయమీ ఖేర్, రాం గోపాల్ వర్మ, అనుభవ్ సిన్హా తోపాటు, అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కూడా కశ్యప్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలను అనురాగ్ ఇప్పటికే ఖండించారు. 

మరిన్ని వార్తలు