పౌరులే టార్గెట్‌గా విరుచుకుపడుతున్న రష్యా బలగాలు? ప్రముఖ నటి మృతి

18 Mar, 2022 10:40 IST|Sakshi

రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం మొదలై మూడు వారాలు దాటినా ఉక్రెయిన్ రష్యా బలగాలకు ఏ మాత్రం తలొగ్గలేదు. ఓ వైపు ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా సైనికులు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన చర్చలు ఏమాత్రం సమస్యకు పరిష్కారం చూపకపోయేసరికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశారు.

అయితే మొదటి పది రోజుల రష్యా దాడి కేవలం ఉక్రెయిన్ సైనిక బలగాలే లక్ష్యంగా జరిగినప్పటికీ గత వారం రోజులుగా జనావాసాలు మీద కూడా దాడులు చేసేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదని తెలుస్తోంది.  తాజాగా రష్యా సైనిక దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ నటి ఒక్సానా ష్వెట్స్‌ మరణించారు. కీవ్‌లోని నివాస భవనాలపై రష్యా రాకెట్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో 67 ఏళ్ల ఒక్సానా చనిపోయారని అక్కడి అధికారులు తెలిపారు. (చదవండి: రష్యాకి వ్యతిరేకంగా ఓటు...ఊహించని షాక్‌ ఇచ్చిన భారత న్యాయమూర్తి )

ఒక్సానా ష్వెట్స్ 1955లో జన్మించారు. ఆమె ఇవాన్ ఫ్రాంకో థియేటర్, కీవ్ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్‌లో అభ్యసించారు. సుదీర్ఘకాలం పాటు ఆమె థియేటర్‌ ఆర్టిస్టుగా కొనసాగారు. అంతే గాక అనేక సినిమాల్లో కూడా నటించారు. టుమారో విల్‌ బీ టుమారో, ది సీక్రెట్ ఆఫ్ సెయింట్ పాట్రిక్, ది రిటర్న్ ఆఫ్ ముఖ్తార్ అనే సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఉక్రెయిన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మెరిటెడ్‌ ఆర్టిస్ట్‌ అవార్డును ఈమె గెలుచుకున్నారు. 

మరిన్ని వార్తలు