Model Spends 5 Lakh For Dye Dog: కుక్క హెయిర్‌ డై కోసం 5 లక్షలు.. మోడల్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!

20 Nov, 2021 12:47 IST|Sakshi

Russian Playboy Model Spends 5 Lakh For Dye Dog: గతంలో సెలబ్రిటీలు ఏం చేసినా పెద్దగా తెలిసేది కాదు. ఒకవేళ తెలిసిన అది మీడియా ద్వారా తెలియాల్సిందే. అయితే సోషల్‌మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చేసే ప్రతీది ప్రపంచ మారుమూలాలకు వెళ్తోంది. అయితే అందులో కొన్ని నెటిజన్లకు నచ్చితే పోగడ్తలతో ముంచెత్తడం, లేదంటే విపరీతమైన ట్రోలింగ్‌ చేయడం సర్వ సాధారణం. తాజాగా ఓ పాపులర్‌ మోడల్‌ చేసిన పనికి నెటిజన్లు ఆమెను ఆడేసుకుంటున్నారు. పెంపుడు జంతువులను పెంచుకోవడం అందరికి సరదానే. కాకపోతే ధనవంతులు వాటిని జంతువుల్లా కాకుండా తమ సొంత మనుషుల్లా చూసుకుంటారు.


రష్యాకు చెందిన ‘ప్లేబాయ్’ మోడల్ పేరు అన్నా స్టూపక్ తన తన పెంపుడు కుక్కకి ఫోటోషూట్ చేయాలనుకుంది. ఇందులో ఆమెను విమర్శించాలి పని ఏముందని అనుకుంటున్నారా?. కానీ, అమ్మడు సరికొత్తగా ఆలోచించి ఫోటోషూట్ కోసం తన కుక్క పిల్ల కలర్‌నే మార్చేసింది. దాని ఒంటి మీదున్న వెంట్రుకలకు డై చేయించింది. అలా ఓ ఫోటో షూట్‌ కోసం ఏకంగా ఖర్చు 5 వేల యూరోలు (రూ. 5 లక్షలు) ఖర్చు పెట్టింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. అయితే  చాలా మంది నెటిజన్లు మాత్రం ఇది మూగ జీవాన్ని హింసించడమేనంటూ ఆమెపై ఫైర్ అయ్యారు. దీంతో అన్నా తన చర్మానికి ఎలాంటి హానీ జరగకుండానే వైట్ డాగ్‌ను ఆరెంజ్ డాగ్‌గా మార్చామని బదులిచ్చింది. అయినా ఆమెపై విమర్శుల మాత్రం ఆగడం లేదు.

చదవండి: బాడీలో ఆ పార్ట్‌కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్‌

మరిన్ని వార్తలు