బాలీవుడ్‌లోకి ఆర్‌ఎక్స్‌ 100, అల వైకుంఠపురములో.. టైటిల్స్‌ ఇవే

27 Oct, 2021 16:59 IST|Sakshi

టాలీవుడ్ స్టోరీలు బాలీవుడ్ కి వెళుతున్నాయి. మన కథలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. రస్టిక్ లవ్ స్టోరీస్ ని మాత్రమే కాదు తెలుగులో సక్సెస్ అయిన కమర్షియల్ చిత్రాల్ని కూడా బాలీవుడ్ మేకర్స్ అస్సలు వదిలిపెట్టడం లేదు. అలాంటి రెండు రీమేక్స్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం..

షెహజాదా... అంటే యువరాజు అని అర్థం. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో చిత్రానికి ఇది బాలీవుడ్ రీమేక్. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు టీ సిరీస్, బ్రాత్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. అల్లు అర్జున్ పోషించిన పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. కృతీ సనన్ హీరోహిన్ గా యాక్ట్ చేస్తోంది. టబు పోషించిన పాత్రలో మనీషా కోయిరాల కనిపించబోతుంది. షెహజాదా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు 2022 నవంబర్ 4న షెహజాదా రిలీజ్ కాబోతున్న ప్రకటించింది మూవీ టీమ్. 

తడప్.. తెలుగులో స్టన్నింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్ఎక్స్100 కు హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాని మిలన్ లూద్రియా డైరెక్ట్ చేస్తున్నాడు. అషన్ శెట్టి, తారా సుతారియా హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 3న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు