నీలా.. నన్నిలా..

1 Jun, 2023 01:27 IST|Sakshi

సాహస్, దీపిక జంటగా చైతు మాదాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘7:11’. నరేన్‌ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘నీలా.. నన్నిలా...’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. గ్యానీ స్వర పరచిన ఈ మెలోడీ సాంగ్‌కు మణి దీపక్‌ కడిమిశెట్టి సాహిత్యం అందించగా అనురాగ్‌ కులకర్ణి పాడారు.

‘‘ఇది టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగే సైన్స్‌ ఫిక్షన్‌ క్రైమ్‌ డ్రామా. 1999లో ఒక ముఖ్యమైన రోజున భవిష్యత్తులో 400 సంవత్సరాలలో వేరే గ్రహం నుండి మానవుల మనుగడకు సంబంధించిన కీలకమైన సమాధానాల కోసం ‘హంసలదీవి’ అనే చిన్న ఇండియన్‌ టౌన్‌కి చేరుకుంటారు. అదే రోజున ఆ టౌన్‌ని నాశనం చేయడానికి కొన్ని ఘటనలు జరుగుతాయి’’ అని యూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు