ప్రేయ‌సిని పెళ్లాడిన 'సాహో' డైరెక్ట‌ర్

4 Aug, 2020 11:49 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : సాహో’ చిత్ర దర్శకుడు సుజీత్ ప్రేయ‌సిని  ఆగ‌స్టు  2న  పెళ్లాడాడు. పంచ‌భూతాల సాక్షిగా డెంటిస్ట్ ప్ర‌వ‌ళిక‌తో ఏడ‌డుగులు వేశాడు. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ యంగ్‌ డైరెక్టర్ పెద్దల అంగీకారంతో ఇష్ట‌స‌ఖిని మ‌నువాడాడు. హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు రిసార్టులో జ‌రిగిన ఈ పెళ్లి వేడుక‌కు అత్యంత స‌న్నిహితులు, కుటుంబ‌స‌భ్యులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు స‌మాచారం. 29 ఏళ్ల యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ సాంప్ర‌దాయ ధోతి, కుర్తా ధ‌రించ‌గా, వ‌ధువు ప్ర‌వ‌ళిక గులాబీ రంగు చీర‌లో మెరిసిపోయింది. హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం భౌతిక దూరం పాటిస్తూ పెళ్లి వేడుక జ‌రిగింది. వివాహానికి హాజ‌రైన బంధువులు నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవ‌ల హీరో నితిన్, నిఖిల్, కమెడియన్ మహేష్, నిర్మాత దిల్ రాజు  ఇలా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఒక్కొక్క‌రు పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెలిసిందే. (నితిన్‌ సినిమాకు నో చెప్పిన బుట్టబొమ్మ!)

డైరెక్ట‌ర్ సుజీత్ పెళ్లి వేడుక‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. జూన్ 10న హైద‌రాబాదులో సుజీత్ -ప్రవళికల నిశ్చితార్థం జ‌రిగింది.  'ర‌న్ రాజా ర‌న్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా వెండితెర‌పై అడుగుపెట్టిన సుజీత్‌కు ఆ సినిమా సూప‌ర్ హిట్ కొట్ట‌డంతో ఏకంగా ప్రభాస్‌తో క‌లిసి ప‌ని చేసే ఛాన్స్ కొట్టేశాడు. హాలీవుడ్ అంత‌టి రేంజ్‌లో 'సాహో' చిత్రాన్ని తెర‌కెక్కించి విశేష‌ గుర్తింపు సాధించాడు. ప్ర‌స్తుతం సుజీత్ 'లూసిఫ‌ర్' రీమేక్ తెర‌కెక్కించ‌నుండ‌గా ఇందులో మెగాస్టార్ చిరంజీవి న‌టించ‌నున్నారని సమాచారం. ఇంకా స్క్రిప్ట్‌ను మెరుగులు దిద్దుతూ ఉన్నందున ఈ ఏడాది చివ‌రికి ఆ చిత్రం ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.  (వర్మ నోట ‘మర్డర్‌’పాట.. విడుదల)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా