Casting Couch: 'చాలా కామన్‌ అన్నాడు.. దేనికైనా ఓకె చెప్పాలని అడిగాడు'..

2 Oct, 2021 14:27 IST|Sakshi

Saath Nibhana Saathiya-2 Sneha Jain Talks About Casting Couch: హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పదం `కాస్టింగ్ కౌచ్`. ఇటీవలి కాలంలో ఎంతో మంది నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. తాజాగా నటి స్నేహా జైన్‌ తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ఓ  ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. కెరీర్‌ ఆరంభంలో తాను కూడా  క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నానని, దక్షిణాది పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది.

'కాలేజ్‌ స్టూడెంట్స్‌ నేపథ్యంలో సాగే ఓ సినిమాలో నాకు అవకాశం ఇస్తానని ఓ సౌత్‌ డైరెక్టర్‌ నుంచి కాల్‌ వచ్చింది. దాంతో నా ఫోటోలు, వివరాలను ఆయన పంపించాను.  మరుసటి రోజు ఫోన్‌ చేసి హైదరాబాద్‌ రమ్మని చెప్పిన ఆయన ఒక రోజంతా తనతోనే గడపాలని, దేనికైనా ఓకే చెప్పాలన్నాడు. ఆ మాటలకు షాక్‌ అయ్యాను. నేను అలాంటివి చేయనని చెప్పేశాను.

అయితే వారం తర్వాత మళ్లీ ఆ డైరెక్టర్‌ నాకు కాల్‌ చేసి ఇలాంటివి చాలా కామన్‌. నువ్వు ఓకే అంటే ఇప్పటికీ ఆ ఆఫర్‌ ఉందని చెప్పాడు. నాకు కోపం వచ్చి గట్టిగా అరచి ఫోన్‌ పెట్టేశాను' అని చెప్పుకొచ్చింది. స్నేహా జైన్‌ ప్రస్తుతం ‘సాత్ నిభానా సాథియా-2’లో నటిస్తుంది. 

చదవండి : 'మా'ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌: మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే...
కొడుకుతో పార్క్‌కు వెళ్లిన షకీరా.. ఒక్కసారిగా అడవి పందుల దాడి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు