Sahher Bambba: వెబ్‌ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న మోడల్‌

24 Apr, 2022 08:03 IST|Sakshi

అందమైన నవ్వు.. నాజూకైన ఆకృతి.. చక్కటి హావభావాలను ఒక్కచోట ఫోకస్‌ చేస్తే.. సాహెర్‌ బంబా. వెబ్‌ తెరకు కొత్త గ్లామర్‌ను పరిచయం చేసిన ఆమె గురించి కొన్ని వివరాలు.. 

పుట్టింది, పెరిగింది సిమ్లాలో. తల్లి.. శిలా బంబా, తండ్రి సునీల్‌బంబా. సాహెర్‌ డిగ్రీ పట్టా పుచుకుంది ముంబైలోని జై హింద్‌ కాలేజీలో. సాహెర్‌ మంచి యోగా నిపుణురాలు కూడా. తన ఫిట్‌నెస్‌ రహస్యం క్రమం తప్పని కథక్, యోగా ప్రాక్టీసే అంటుంది. వెబ్‌ కంటే ముందు బిగ్‌ స్క్రీన్‌ మీదే కనిపించింది ‘పల్‌ పల్‌ దిల్‌ కే పాస్‌’ సినిమాతో.

డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే మోడల్‌గా రాణించింది. 2016లో ఒప్పో బాంబే టైమ్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌ టైటిల్‌ గెలుచుకుంది. చిన్నప్పుడే కథక్‌ డాన్స్‌ నేర్చుకుంది. డ్యాన్స్‌ మీదున్న మక్కువే నటన మీద కుతూహలాన్ని, ఆసక్తిని పెంచింది. కరోనా సమయంలో వెబ్‌ ఎంట్రీ ఇచ్చింది ‘దిల్‌ బేకరార్‌’ సిరీస్‌తో. సినిమా కంటే కూడా ఆ సిరీస్‌తోనే పాపులారిటీ సంపాదించుకుంది. 

వెబ్‌ సిరీస్‌లో నటించొద్దు, దాని వల్ల సినిమా అవకాశాలు పోతాయని చాలా మంది పెద్దలు నన్ను హెచ్చరించారు. కానీ కరోనాలో నన్ను బిజీగా ఉంచింది వెబ్‌ సిరీసే. పైగా ఎక్కువ మంది ప్రేక్షకులకూ దగ్గర చేసింది. అందుకే నేను రెండిటికీ ఈక్వల్‌ ప్రయారిటీ ఇస్తాను. ఇంకా చెప్పాలంటే నేను పోషించే పాత్ర ప్రాధాన్యమే నాకు ముఖ్యం. మాధ్యమం ఏదైనా సరే. అయినా సినిమాకు, వెబ్‌ సిరీస్‌కు పెద్ద తేడా కూడా ఏం లేదు. మేకింగ్‌లో కానీ.. రీచింగ్‌లో కానీ!
– సాహెర్‌ బంబా

చదవండి: మెగాస్టార్‌ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జక్కన్న

మరిన్ని వార్తలు