పెళ్లంటే పెద్ద‌గా ఇంట్రెస్ట్ లేదు: హీరో

26 Oct, 2020 18:54 IST|Sakshi

ముప్ప‌య్యో ప‌డిలో అడుగుపెట్టినా స‌రే టాలీవుడ్ హీరోలు పెళ్లంటే వెన‌క‌డుగు వేస్తున్నారు. అయితే స‌డ‌న్‌గా ఏదో మ్యాజిక్ జ‌రిగిన‌ట్టు మొన్న‌టి లాక్‌డౌన్‌లో నిఖిల్‌, నితిన్‌, రానా వ‌రుస‌గా పెళ్లిళ్లు చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. దీంతో మ‌రికొంద‌రు హీరోలు కూడా బ్యాచ్‌ల‌ర్ లైఫ్‌కు ఎండ్ ‌కార్డ్ పెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. ముఖ్యంగా 'సోలో బ్ర‌‌తుకే సో బెట‌ర్' సినిమా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా కోడై కూసింది. ఇక అక్టోబ‌ర్ 15న చిరంజీవి అత‌డికి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు చెప్తూ నీ బ్యాచిల‌ర్ లైఫ్ ఇంకొన్ని రోజులే’ అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో మెగా ఇంట మ‌రో పెళ్లికి స‌ర్వం సిద్ధం అవుతోందంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకున్నారు. (చ‌ద‌వండి: ‘నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను డార్లింగ్‌, ట్రెండ్‌ సెట్‌ చేస్తా’)

అయితే ఈ వార్త‌ల‌పై సాయి ధ‌ర‌మ్ ఓ క్లారిటీ ఇచ్చేశారు. "ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తామంటే చూసుకోండ‌ని చెప్పాను, అంతే! కానీ మీడియా వాళ్లే నా పెళ్లి వెన‌క ప‌డ్డారు. ప్ర‌స్తుతానికి పెళ్లంటే ఇంట్రెస్ట్ లేదు. ఒక‌వేళ అమ్మాయి బాగుంద‌ని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేస్తే ఆలోచిస్తా"న‌ని స్ప‌ష్టం చేశారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. గ‌తేడాది "ప్ర‌తిరోజు పండ‌గే" సినిమాతో ఆయ‌న‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు. ప్ర‌స్తుతం 'సోలో బ్ర‌‌తుకే సో బెట‌ర్' సినిమాతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. (చ‌ద‌వండి: అల్లుడికి చిరు బర్త్‌డే విషెస్‌‌.. ఆనందంలో హీరో!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా