కుటుంబ సభ్యులతో సాయిధరమ్‌ తేజ్

5 Nov, 2021 21:31 IST|Sakshi

మీ అందరి దీవెనలు ఫలించాయి

చిరంజీవి ట్వీట్‌

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం అనంతరం కోలుకున్న సాయిధరమ్‌ తేజ్‌.. మీడియాకు కన్పించలేదు. అపోలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న సాయిధరమ్‌.. అటు తర్వాత నివాసానికే పరిమితమయ్యాడు. కాగా, కుటుంబ సభ్యులతో కలిసి  దీపావళి వేడుకలు చేసుకున్నాడు సాయిధరమ్‌ తేజ్‌. చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి వేడుకలకు విచ్చేశాడు.

దీనిపై చిరంజీవి ట్విట్టర్లో స్పందించారు. అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ‘ మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని ట్వీటర్‌ వేదికగా ఫోటోను పోస్ట్‌ చేశారు. అందులో మెగాస్టార్‌ చిరంజీవీ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చేయి వేసి ఉండగా,  పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్‌లు ఉన్నారు.

మరిన్ని వార్తలు