'బిల్లా-రంగా' రీమేక్‌‌లో వార‌సులు

15 Oct, 2020 17:40 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్‌కింగ్ మోహ‌న్ బాబు క‌లిసి న‌టించిన బిల్లా రంగా సినిమా త్వ‌ర‌లోనే రీమేక్ కానుందా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తుంది. గురువారం హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మంచు మ‌నోజ్  బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశాడు.  ఈ సంద‌ర్భంగా అప్ప‌టి సూప‌ర్‌హిట్ `బిల్లా రంగా` పోస్ట‌ర్‌ను సాయి ధ‌ర‌మ్‌తేజ్‌ ట్విట‌ర్‌కి ట్యాగ్ చేశారు. 'బిల్లారంగా విడుద‌లై నేటికి  38 సంవత్సరాలు పూర్త‌యింంది, ఈరోజే నీ పుట్టిన‌రోజు కావ‌డం విశేషం.. అంటే ఈ ర‌కంగా మ‌న‌కు  ఏదో హింట్ ఇస్తున్న‌ట్లుంది బాబాయ్..  ఇది చేయ‌డానికి నేను రెడీ.. నువ్వు రెడీనా 'అంటూ మ‌నోజ్ ట్వీట్ చేశాడు.  (అల్లుడికి చిరు బర్త్‌డే విషెస్‌‌.. ఆనందంలో హీరో! )

దీంతో మ‌రికొన్ని రోజుల్లోనే బిల్లారంగా రీమేక్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. విభిన్న చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ గురువారం 34వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా తేజ్‌కు సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.  సాయి ధరమ్‌ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల  కానుంది. (మనోజ్‌ బర్త్‌డే.. వలస కూలీలకు సాయం)

మరిన్ని వార్తలు