Sai Dharam Tej : సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా ప్రారంభం

3 Dec, 2022 12:57 IST|Sakshi

సాయి ధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నూతన చిత్రం శుక్రవారం ప్రారంభమైంది.ఈ చిత్రంతో జయంత్‌ పానుగంటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై బాపినీడు  సమర్పణలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బాపినీడు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. తేజ్‌ క్లాప్‌ కొట్టారు.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘తేజ్‌తో మా నిర్మాణ సంస్థకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదే అనుబంధంతో ఇప్పుడు ఆయన మా బ్యానర్‌లో మరో సినిమా చేస్తున్నారు. అన్ని వరాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు