మంచు వారి మూవీలో మెగా హీరో

22 Mar, 2021 15:54 IST|Sakshi

హైదరాబాద్‌:  మంచు, మెగా కుటుంబాల హీరోలు కలిసి నటిస్తే చూడాలనుకునే సినీ ప్రియుల ఆశ నెరవేరనుందని చెప్పాలి. మంచు ఫ్యామిలీకి చెందిన ఓ హీరో సినిమాలో కొణిదల వారి మేనల్లుడు నటించనున్నట్లు సమాచారం. ఇంతకీ  ఆ హీరోలు ఎవరంటే మనోజ్‌, సాయిధరమ్‌ తేజ్‌. ప్రస్తుతం మనోజ్‌ నటిస్తున్న  ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఓ పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్‌లో వినికిడి. 

చాలా కాలం విరామం తర్వాత మనోజ్‌  ‘అహం బ్రహ్మాస్మి’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నరు. ఈ సినిమాలో మనోజ్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నట్లు విడుదలైన మొదట ఫోస్టర్‌ ని చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి- కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కలిసి నటించిన ‘బిల్లారంగా’ను మనోజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ రీమేక్‌ చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా మనోజ్‌ సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాతోనైనా విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.  ( చదవండి : ఇంటివాడు కాబోతున్న సాయ్‌ తేజ్‌.. మేలో పెళ్లి! )

మరిన్ని వార్తలు