సాయి పల్లవి స్పెషల్‌ టాలెంట్‌ ‌: అభిమానులు ఫిదా

11 Jan, 2021 11:34 IST|Sakshi

ట్రెండింగ్‌లో సాయి పల్లవి డాన్స్ స్టెప్

సాయి పల్లవి స్పెషల్‌ టాలెంట్‌కు ఫిదా అ వుతున్న అభిమానులు 

సాక్షి, హైదరాబాద్ ‌: ప్రముఖ హీరోయిన్‌ సాయి పల్లవి అంటేనే డ్యాన్స్‌కు పెట్టింది పేరు. తనదైన శైలిలో సెలెక్ట్‌డ్‌ మూవీస్‌ చేస్తూ,  సౌత్ ఇండియాలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్న సాయి పల్లవి తన డిఫరెంట్‌ స్టయిల్‌తో అంతలా గుర్తింపు తెచ్చుకున్నారు. మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్‌గా అభిమానుల్లో   క్రేజ్‌ సంపాదించుకున్నారు.  తాజాగా తన అప్‌ కమింగ్‌ మూవీ లవ్ స్టోరీ టీజర్‌లోని  ఒక స్పెషల్‌ పిక్‌ వైరల్‌ అవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా  టీజర్‌ను ఆదివారం యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ  టీజర్‌లో సాయి పల్లవి డాన్స్‌తో అదరగొట్టింది. దీంతో ప్రేమమ్‌ సినిమాలో ఆమె అద్భుతమైన డ్యాన్స్‌ గుర్తు చేసుకుంటున్న అభిమానులు ఆమెకు మరోసారి ఫిదా అవుతున్నారు.  (యూత్‌కు కనెక్ట్‌ అయ్యే ‘లవ్‌స్టోరీ’)

ముఖ్యంగా  సాయి పల్లవి వర్షంలో జంపింగ్‌ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది.  సాయి పల్లవికి మాత్రమే ఇలాంటి స్టెప్ లు సాధ్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సినిమా హిట్ అవుతుందని కూడా ఆశిస్తున్నారు. కాగా  టాలీవుడ్‌ హీరో నాగచైతన్య జంటగా సాయి పల్లవి  నటిస్తున్న  లవ్ స్టోరీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం  తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు