కోర్టు మెట్లు ఎక్కిన సాయిపల్లవి.. రియల్‌ లైఫ్‌లో కాదులెండి!

4 Jul, 2022 05:11 IST|Sakshi

హీరోయిన్‌ సాయిపల్లవి కోర్టు మెట్లు ఎక్కారు. అయితే రియల్‌ లైఫ్‌లో కాదులెండి. రీల్‌ లైఫ్‌లో. ఇంతకీ ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? ఏ విషయంలో న్యాయం కోసం కోర్టుకు వెళ్లారు? అనే విషయాలు తెలియాలంటే ‘గార్గి’ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గార్గి’. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించారు. కాలి వెంకట్, శరవణన్‌ కీలక పాత్రధారులు.

2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక సమర్పిస్తున్నారు. రవిచంద్రన్‌ రామచంద్రన్,  ఐశ్వర్యా లక్ష్మి, థామస్‌ జార్జి, గౌతమ్‌ రామచంద్రన్‌ నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 15న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ‘‘కోర్టు డ్రామాగా రూపొందిన చిత్రం ‘గార్గి’. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 15న విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. 

మరిన్ని వార్తలు