ఓటీటీలోకి 'విరాట పర్వం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

29 Jun, 2022 18:42 IST|Sakshi

విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’.  తొలిసారి నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 17న థియేటర్స్‌లో విడుదలపై మంచి టాక్‌ని సొంతం చేసుంది. ముఖ్యంగా వెన్నెలగా సాయి పల్లవి యాక్టింగ్‌ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అచ్చం తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఇక కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా ఒదిగిపోయాడు. తెరపై నిజమైన దళనాయకుడిగా కనిపించాడు.

థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్దమైంది. ఈ  సినిమా డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది. జూలై 1నుంచి తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది.  

(చదవండి: ఓటీటీలో కమల్ హాసన్‌ 'విక్రమ్‌'.. ఎప్పుడు ? ఎక్కడంటే ?)

ఈ చిత్రంలో రానా, సాయిపల్లవితో పాటు, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, నివేదా పేతురాజ్ కూడా నటించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్ మరియు శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

మరిన్ని వార్తలు