Sai pallavi: పెళ్లి రూమర్స్‌పై ఫైర్‌ అయిన సాయిపల్లవి

22 Sep, 2023 17:16 IST|Sakshi

విరాటపర్వం, గార్గీ చిత్రాల తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న సాయిపల్లవి ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్, తెలుగులో నాగచైతన్యతో సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె పెళ్లి వార్తలపై పలు వార్తలు సోషల్‌ మీడియా ద్వారా విపరీతంగా వైరల్‌ అయ్యాయి. పలాన దర్శకుడితో సాయిపల్లవి పెళ్లి అంటూ ఫోటోలతో రూమర్స్‌ క్రియేట్‌ చేశారు. ఇవి గత కొద్ది రోజులుగా యూట్యూబ్‌ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో భారీగానే కనిపించాయి. తాజాగా సాయిపల్లవి తన ఎక్స్‌ ట్విటర్‌   ద్వారా ఒక పోస్ట్‌ చేసింది. రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించని సాయిపల్లవి తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను కూడా ఇందులోకి లాగుతుండటంతో ఆమె స్పందించింది.

(ఇదీ చదవండి: 'సినిమాలో నువ్వు విలన్.. రియాలిటీలో నేనే విలన్'.. చంపేస్తామని బాబీకి స్నేహితుల వార్నింగ్‌)

నిజం చెప్పాలంటే, నేను రూమర్స్‌ను అసలు పట్టించుకోను, కానీ ఇందులో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడంతో తప్పక స్పందిచాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో నేను మాట్లాడాలి. నా సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫోటోను ఉద్దేశపూర్వకంగా కట్‌ చేసి కొందరు ఇలాంటి చెత్తపని చేశారు. ఇదీ చాలా అసహ్యకరమైన చర్య. నా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం విడుదల చేసిన ఫోటోతో ఇలాంటివి క్రియేట్‌ చేయడం చాలా బాధ అనిపించింది.

సంతోషంగా సినిమా ప్రారంభ సమయంలో ఇలాంటివి క్రియేట్‌ చేయడం వల్ల మమ్మల్ని ఎంతో నిరుత్సాహపరుస్తుంది. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం అనేది నీచమైన చర్య.' అని సాయి పల్లవి తెలిపింది. అయితే అందరూ అనుకుంటున్నట్లు అది సాయిపల్లవి పెళ్లి ఫొటో కాదు, శివకార్తికేయన్ సినిమా పూజా కార్యక్రమంలోని ఫొటో. కానీ కొందరు ముందు వెనక చూడకుండా ఈమెకు పెళ్లయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని  'విరాటపర్వం' దర్శకుడు వేణు ఊడుగుల కూడా పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు