Sai Pallavi: వ్యాఖ్యల దుమారం.. వివరణ ఇచ్చిన సాయిపల్లవి

19 Jun, 2022 12:09 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సాయి పల్లవి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో చూపించిన హింస, గోరక్షక దళాలు చేస్తున్న దాడుల మధ్య తేడా ఏముందని, మానవత్వం గురించి ఆలోచించాలని ఆమె అన్నారు. సాయి పల్లవి వ్యాఖ్యలపై ఓ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై సాయి పల్లవి స్పందించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవ్వరినీ కించపరిచే విధంగా తాను మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.

(చదవండి: ‘విరాట పర్వం’ సినిమాను బ్యాన్‌ చేయాలి.. సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో ఫిర్యాదు)

‘నా దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్ప.  ఏ మతంలోనైనా హింస మంచిది కాదని గతంలోనే చెప్పాను. కానీ నా మాటల్నీ కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని ఏవోవో ప్రచారం చేశారు. ఒక డాక్టర్‌గా ప్రాణం విలువ ఏంటో నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు’అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు