'రౌడీ బేబీ' పాట పాతదే.. అయితేనేం రికార్డ్ కొత్తది

9 Jul, 2021 21:28 IST|Sakshi

రౌడీ బేబీ సాంగ్‌ రిలీజై రెండేళ్లు దాటినా యూట్యూబ్‌లో రికార్డుల సునామీ సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఈ సాంగ్‌  మరో మైలు రాయిని చేరుకుంది.  ఈ సారి ఏకంగా దక్షిణాదిలోనే ఓ అరుదైన ఘనత సాధించిన తొలి సాంగ్‌గా తన పేరు నమోదు చేసుకుంది. 

‘రౌడీ బేబీ’ యూట్యూబ్‌ రికార్డుల మోత ఆగేలా లేదు
తన డ్యాన్సులతో, యాక్టింగ్‌తో సాయి పల్లవి అందర్నీ కట్టిపడేస్తూ ఉంటుంది. సాయి పల్లవి వీడియో సాంగ్‌లు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. మొన్న ఫిదాలోని ‘వచ్చిండే’ సాంగ్‌ ఒకప్పుడు రికార్డులు సృష్టిస్తే.. నిన్న ‘రౌడీ బేబీ’ సాంగ్‌ యూట్యూబ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నేడు ‘ సారంగదరియా’  దూసుకుపోతోంది. ఈ క్రమంలో సాయిపల్లవి పాటల రికార్డులు కొత్త పాత అనే తేడా లేకుండా నెట్టింట రచ్చ చేస్తున్నాయి.

దక్షిణాదిలోనే టాప్‌
తాజాగా యూట్యూబ్‌లో 5 మిలియన్‌ లైక్స్‌ పొందిన తొలి సౌత్‌ ఇండియా సాంగ్‌గా ‘రౌడీ బేబీ’ నిలిచింది. అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను అందుకున్న సాంగ్‌ కూడా కావాడం విశేషం. అదే క్రమంలో 1.1 బిలియన్ల వ్యూస్‌తో ఎక్కువ మంది వీక్షించిన పాట కూడా ఇదే గమనార్హం.  విడుదలైన రెండున్నర సంవత్సరాల తరువాత కూడా యూట్యూబ్‌లో రౌడీ బేబీ రికార్డుల మోత మోగుతూనే ఉంది. ఈ పాట ఇప్పటికీ ప్రజల హృదయాలను శాసిస్తూ, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో తిరుగులేని బ్లాక్‌బస్టర్‌గా మిగిలిపోయింది. ఇప్పటికే, రౌడీ బేబీ సోషల్ మీడియాలో చాలా రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.

చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే  ఈ సాంగ్‌ నెట్టింట విపరీతంగా రచ్చ చేయడంతో  సినిమా విడుదలైన కొద్ది రోజులకే చిత్రయూనిట్‌ రౌడీబేబీ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఇక అప్పడు మొదలైన రికార్డుల వేట కోనసాగుతూనే ఉంది. ఇన్ని రికార్డులను క్రియేట్‌ చేసిన ఈ పాటకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించగా, ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌, దర్శకుడు ప్రభుదేవా కొరియోగ్రఫి చేశారు. 

మరిన్ని వార్తలు